మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
      

 

Sri Krishna Stotram (Vasudeva krutam) – శ్రీ కృష్ణస్తోత్రం (వసుదేవ కృతం)


త్వామతీంద్రియమవ్యక్తమక్షరం నిర్గుణం విభుమ్ |
ధ్యానాసాధ్యం చ సర్వేషాం పరమాత్మానమీశ్వరమ్ || 1 ||

స్వేచ్ఛామయం సర్వరూపం స్వేచ్ఛారూపధరం పరమ్ |
నిర్లిప్తం పరమం బ్రహ్మ బీజరూపం సనాతనమ్ || 2 ||

స్థూలాత్ స్థూలతరం ప్రాప్తమతిసూక్ష్మమదర్శనమ్ |
స్థితం సర్వశరీరేషు సాక్షిరూపమదృశ్యకమ్ || 3 ||

శరీరవంతం సగుణమశరీరం గుణోత్కరమ్ |
ప్రకృతేః ప్రకృతీశం చ ప్రాకృతం ప్రకృతేః పరమ్ || 4 ||

సర్వేశం సర్వరూపం చ సర్వాంతకరమవ్యయమ్ |
సర్వాధారం నిరాధారం నిర్వ్యూహం స్తౌమి కిం విభుమ్ || 5 ||

అనంతః స్తవనేఽశక్తోఽశక్తా దేవీ సరస్వతీ |
యం వా స్తోతుమశక్తశ్చ పంచవక్త్రః షడాననః || 6 ||

చతుర్ముఖో వేదకర్తా యం స్తోతుమక్షమః సదా |
గణేశో న సమర్థశ్చ యోగీంద్రాణాం గురోర్గురుః || 7 ||

ఋషయో దేవతాశ్చైవ మునీంద్రమనుమానవాః |
స్వప్నే తేషామదృశ్యం చ త్వామేవం కిం స్తువంతి తే || 8 ||

శ్రుతయః స్తవనేఽశక్తాః కిం స్తువంతి విపశ్చితః |
విహాయైవం శరీరం చ బాలో భవితుమర్హసి || 9 ||

వసుదేవకృతం స్తోత్రం త్రిసంధ్యం యః పఠేన్నరః |
భక్తిం దాస్యమవాప్నోతి శ్రీకృష్ణచరణాంబుజే || 10 ||

విశిష్టపుత్రం లభతే హరిదాసం గుణాన్వితమ్ |
సంకటం నిస్తరేత్తూర్ణం శత్రుభీతేః ప్రముచ్యతే || 11 ||

ఇతి శ్రీబ్రహ్మవైవర్తమహాపురాణే శ్రీకృష్ణజన్మఖండే సప్తమోఽధ్యాయే వసుదేవకృత శ్రీ కృష్ణ స్తోత్రమ్ |

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.